వంగూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం గర్భిణీ స్త్రీలకు జిల్లా మాతాశిశు ఆరోగ్య సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ లక్ష్మణ్, కల్వకుర్తి డిప్యూటీ డిఎంహెచ్ఒ డాక్టర్ భీమా నాయక్ ల సోమవారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం మాతా శిశు సంరక్షణ రికార్డులను పరిశీలించి వాటిని సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.