మక్తల్: ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతాం

63பார்த்தது
మక్తల్: ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతాం
మక్తల్ మండలం బొండలకుంట గ్రామంలో బుధవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి వంట గ్యాస్ సిలిండర్ ప్రోసిడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రూ. 500 లకు వంట గ్యాస్ అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி