మహబూబ్ నగర్: సదర్ ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని చిన్న దర్పల్లిలో శనివారం జరిగిన సదర్ ఉత్సవాలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకుందాం అని అన్నారు. పశు సంపదను గౌరవించి, వాటిని పూజించడం తరతరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ అని, ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు.