ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మొన్న కురిసిన భారీ వర్షాలకు పట్టణంలోని పాత పాలమూరు 11వ వార్డు, 1వ వార్డుకి చెందిన ఐదు ఇండ్లు నేలమట్టం అయినాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి వారికి వచ్చిన ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే చేతులమీదుగా గురువారం క్యాంపు కార్యాలయంలో ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలు పడుతున్నప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలన్నారు.