కొల్లాపూర్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే మంత్రి జూపల్లి లక్ష్యం
ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పని చేస్తున్నారని మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య అన్నారు. మంగళవారం కొల్లాపూర్ లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ మోడల్ పాఠశాలను మునిసిపల్ వైస్ చైర్పర్సన్ మహమూద్ బేగం, కమిషనర్ శ్రీనివాస్‌తో కలిసి ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థినులకు అందించే డిజిటల్ బోధన గురించి తెలుసుకున్నారు.