ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మరో 12 ఎకరాల స్థలం కొన్నారు. ఆయన తరఫున రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ సుధీర్ మంగళవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ స్థలంలో పవన్ ఇల్లు, క్యాంపు కార్యాలయం నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కాగా, పవన్ ఇప్పటికే భోగాపురంలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడలో 2.08 ఎకరాల స్థలం కొన్నారు.