రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసి వాహనదారుల మృతికి కారకులు కావద్దని మంగళవారం కోడేరు మండలం ఎస్సై గోర్తికుంట గోకారి సూచించారు. రోడ్లపై ధాన్యం ఆరబోసి నల్లని కవర్లు కప్పడంతో రాత్రి వేళలో రోడ్డు కనిపించక ప్రమాదాలు జరిగి చనిపోతున్నారని పేర్కొన్నారు. అందుకు కోడేరు మండలంలోని రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తమ వ్యవసాయ పోలాల వద్దనే ఆరబోసుకోవాలని సూచించారు. ఎవరైనా రోడ్లపై ధాన్యాన్ని పోస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.