సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోయిన 459 మొబైల్ ఫోన్లు కనుగొని సంబంధిత వ్యక్తులకు అందించినందున జడ్చర్ల పోలీసు స్టేషన్ రాష్ట్రస్థాయిలో 6వ స్థానం లభించింది. ఈ సందర్భంగా జడ్చర్ల సీఐ ఆదిరెడ్డిని మంగళవారం రాష్ట్ర డీజీపీ జితేందర్, జిల్లా ఎస్పీ డి. జానకి ప్రశంసించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ మొబైల్ ఫోన్లు కనుగొనడం, వాటిని సంబంధిత వ్యక్తులకు అప్పగించడం ద్వారా ప్రజలకు మంచి సేవను అందించారు.