సోమశిల నుంచి కృష్ణానదిలో లాంచీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. సోమశిల నుంచి శ్రీశైలానికి శనివారం లాంచిలో ప్రయాణించేందుకు 60 మంది ఆన్ లైన్లో నమోదు చేసుకున్నారు. ఉదయం 8. 30 గంటలకు సోమశిల ఘాట్ నుంచి పర్యాటకులను తీసుకెళ్లే లాంచీ సాయంత్రం 5 గంటలకు శ్రీశైలానికి చేరుకుంటుందన్నారు. లాంచీలో పర్యాటకులకు ఉదయం, సాయంత్రం టీ. స్నాక్స్ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశామన్నారు.