సింగోటం చెరువులో చేప పిల్లల పంపిణీ
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామం శ్రీవారి సముద్రం లో 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలను సోమవారం వదిలారు. జిల్లా మత్స్య సహకార అధ్యక్షుడు ఆంజనేయులు, మత్స్యశాఖ అధికారి రజిని చేప పిల్లలను వదిలారు. శ్రీవారి సముద్రంలో గంగమ్మ తల్లికి పూజలు చేసి పూలు చల్లి చేప పిల్లలను వదిలారు. చేప పిల్లల పంపిణీ వల్ల భవిష్యత్ లో మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురవాలని ఆకాంక్షించారు.