అర్హత కలిగిన ప్రతి రైతుకు రుణమాఫీ చేయడానికి వీలుగా జడ్చర్ల నియోజకవర్గంలో పది రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వ్యవసాయ శాఖాధికారులను ఆదేశించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన వ్యవసాయాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రుణమాఫీకి ఆటంకాలుగా మారిన ఫ్యామిలీ మ్యాపింగ్, ఆధార్ మిస్ మ్యాచింగ్ల వివరాలు రైతుల నుంచి సేకరించాలని కోరారు.