తెలుగుసాహిత్యంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవర్ గ్రీన్ గా అందరూ ఎంతో అద్భుతంగా పాడుకునే “బావా బావా పన్నీరు.. బావను పట్టుకు తన్నేరు, వీధి వీధి తిప్పేరు.. వీశెడు గంధం పూసేరు, చావిడి గుంజకు కట్టేరు.. చప్పిడి గుద్దులు గుద్దేరు”. అనే పాటని అడివి బాపిరాజు రాశారు. ఈ పాట ఆబాలగోపాలాన్ని ఎంతో గొప్పగా ఆకర్షించింది. దాంతో ఆయనను అందరూ “బాపిబావ” అని ఎంతో ముద్దుగా పిలుచుకునేవారు. ఇంకా అందరిని అలరించే ఉత్తేజపూరితమైన గీతాలను ఎన్నో రాశారు.