మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి రోడ్డులో గల బాలికల ఐటీఐ కళాశాలలో టాటా టెక్నాలజీస్ లిమిటెడ్(టీటీఎల్)తో కలిసి తొలి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) కు శుక్రవారం ఐటిశాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎమ్మెల్యేలు జి. మధుసూదన్ రెడ్డి, యెన్నం. శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, తదితరులు పాల్గొన్నారు.