కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్ మండల బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ బయలుదేరుతున్న బీఆర్ఎస్ నాయకులను బాలానగర్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ అరెస్టులకు బీఆర్ఎస్ నాయకులు బయపడరని అన్నారు. కాంగ్రెస్ అహంకార చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.