బిఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే చర్లకోల లక్ష్మారెడ్డి ఆదేశాలతో ఆదివారం ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా పోయినట్లే అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు ఊర్కొండ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. వారు మాట్లాడుతూ. ఎకరానికి రూ. 15000 రైతు భరోసా ఇచ్చేవరకు బిఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని తెలిపారు.