మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీసీకి రిజిస్ట్రార్ మధుసూదన్ రెడ్డి, పలువురు అధ్యాపకులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉపాధి కల్పనకు ఉపయోగపడే కోర్సులకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని, మౌలిక వసతుల కల్పనలో పాలమూరు యూనివర్సిటీని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామన్నారు.