తెలుగు రాష్ట్రాలలోని మార్కెట్లో పత్తి ధరలు పడిపోతున్నాయి దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాలలో అధికంగా రైతులు పత్తిని పండిస్తున్నారు. మార్కెట్లో 15రోజుల కిందట పత్తిధరలు క్వింటాలు రూ. 8, 200 వరకు పలికింది. అయితే కొన్నిరోజులకే రూ. 500-700 ధరలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం తెలంగాణలోని మార్కెట్లో క్వింటా పత్తి గరిష్టధర రూ. 7, 111 పలికినట్లు అధికారులు తెలిపారు.