మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రం నెమ్మదిగా ప్రారంభమైన వాన భారీ వర్షంగా మారింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బెక్కరి బాలకిష్ట రెడ్డి కాలనీ, శేషాద్రి నగర్, రామయ్య బోలి, శివశక్తి నగర్, తదితర ప్రాంతాలలో నాలాలు పొంగి పొర్లాయి. మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.