మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ సంస్థ (మూడ) అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం మూడ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.