దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం వెల్కిచర్ల గ్రామానికి చెందిన ముంగల్చెడు అంజనమ్మ నిమ్స్ ఆస్పత్రిలో న్యూరో సంబంధిత వైద్యం, శస్త్రచికిత్స కోసం రూ. 5 లక్షల రూపాయల ఎల్ఓసిని శుక్రవారం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అందజేశారు. అనంతరం కొత్తకోట మండలం వడ్డేవాట తండా వాసి పాత్లవత్ జోలీ నిమ్స్ ఆస్పత్రిలో మోకాళ్ళ సర్జరీ కోసం రూ. 75, 000/- ఎల్ఓసిని అందజేశారు. వారికి మెరుగైన చికిత్స అందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.