దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలోని పెద్ద చెరువులో తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన చేప పిల్లలను సోమవారం ఎమ్మేల్యే జి. మధుసూదన్ రెడ్డి వదిలారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 39 లక్షల చేప పిల్లలను ఉచితంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో అందజేశామని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు.