మాజీ కేంద్ర మంత్రి దేవేంద్ర ప్రధాన్(84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన న్యూఢిల్లీలోని తీన్ మూర్తి లేన్‌లోని తన కుమారుడి అధికారిక నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. 84 ఏళ్ల ప్రధాన్.. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన మరణం పై పలువురు నాయకులు స్పందిస్తూ.. ఘన నివాళులు అర్పించారు.