ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్‌కు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 4 క్రస్ట్ గేట్లు ఎత్తి 32,400 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 76,555 క్యూసెక్కులుగా ఉంది. కాగా, బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.