రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి (వీడియో)

57பார்த்தது
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చురు జిల్లా సర్దార్‌షహర్ మెగా హైవేపై మంగళవారం అర్థరాత్రి అతివేగంగా వెళుతున్న సఫారీ కారు.. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி