మనలో కొందరు టిఫిన్‌కి బదులు చద్దన్నం తింటుంటారు. ఇది కూడా మన ఆరోగ్యానికి మేలు. పాత కాలంలో పెద్దలు ఇదే తీసుకునే వాళ్లు. అప్పట్లో టిఫిన్స్ ఉండేవి కావు. మిగిలిన అన్నంలో పెరుగు-ఉల్లి వేసుకుని మంచిగా ఆరగించేవాళ్లు. ఇప్పుడైతే పెరుగుని తినకుండా మజ్జిగ తాగుతున్నారు. అయితే, ఇలా రాత్రి అన్నంలో పెరుగు వేసుకుని తీసుకుంటే.. కడుపునొప్పి, పేగు సమస్యలు వంటివి రాకుండా ఉంటాయట. ఆయిల్ ఫుడ్స్ కన్నా చద్దన్నం బెటర్ అని పోషకాహార నిపుణులు తెలిపారు.