కేరళలోని పాలక్కాడ్ జిల్లా పట్టంబి తాలూకా వావనూర్ గ్రామంలో ఫిబ్రవరి 15న ఊహించని ఘటన జరిగింది. ఒక వ్యక్తి బైక్‌పై కూర్చుని ఉండగా, అదే సమయంలో కొందరు అక్కడే పక్కన నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ స్తంభం విరిగి పడింది. స్తంభం తగలడంతో బైక్‌పై కూర్చున్న వ్యక్తి తలకు గాయమైంది. పక్కనే ఉన్న వారు సపర్యలు చేశారు. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.