అంజీర్ (అత్తిపండు)ను తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు అంజీర్ పండును తింటే శరీరానికి విటమిన్లు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా అందుతాయి. అంజీర్ తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో దోహదపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి.. డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండేలా చేస్తుంది. అయితే.. కడుపునొప్పి, కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న రోగులు ఈ పండును తినకూడదు.