ఉలవలు తింటే గుండెకు మేలు

558பார்த்தது
ఉలవలు తింటే గుండెకు మేలు
ఉలవలు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉలవల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే డైటరీ ఫైబర్‌ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వీటిలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్, యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉలవలలో ఉండే ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి వంటి విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

தொடர்புடைய செய்தி