తిరుపతి ఎస్వీ గోశాల నిర్వహణపై అసత్య ప్రచారం చేసిన భూమన కరుణాకర్‌రెడ్డిపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవుల మృతిపై మార్ఫింగ్ ఫొటోలను భూమన విడుదల చేశారని ఆయన చెప్పారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్‌రెడ్డి ఆ మార్ఫింగ్ ఫొటోలు ఇచ్చారన్నారు. భూమనపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల తొక్కిసలాటలోనూ భూమన, హరినాథ్‌రెడ్డి హస్తం ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.