TG: మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రావడంపై మరో ప్రచారం మొదలైంది. డిసెంబర్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం పూర్తవుతుంది. దాంతో సంవత్సరం కాలంలో కాంగ్రెస్ చేసిన పనులు.. అప్పులు.. ప్రయోజనాలపై స్టడీ చేసి నిలదీసేందుకు వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ రాకకు డిసెంబర్ ముహూర్తం ఖరారు అయినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు సైతం వెల్లడిస్తున్నాయి. డిసెంబర్ లేదంటే జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో ఇదే సరైన సమయం అని కేసీఆర్ కూడా నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు.