ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు తెలంగాణ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. జనవరి 13 నుంచి 23 వరకు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తన పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే ఈ నెలలో బ్రిస్బేన్, దావోస్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనలకు వెళ్లాల్సి ఉండడంతో పాస్‌పోర్టును ఇవ్వాలని కోరగా కోర్టు అనుమతి మంజూరు చేసింది.