గుజరాత్లో రైలు పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగింది. ఇది భగ్నం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సూరత్ సమీపంలోని వడోదర డివిజన్ పరిధిలో అప్ లైన్ రైల్వేట్రాక్లోని ఫిష్ ప్లేట్, కీని కొందరు దుండగులు తెరిచి ఉంచారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు కొద్దిసేపు రైళ్ల రాకపోకలను నిలిపివేయాల్సి వచ్చింది. పూర్తిస్థాయిలో తనిఖీలు, మరమ్మతులు చేసిన తర్వాత రైలు సేవలను పునరుద్ధరించారు.