TG: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత పారదర్శకంగా అమలుచేసే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించింది. ఈ వెబ్‌సైట్‌ను గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో సమస్యలు తలెత్తితే వెంటనే indirammaindlu.telangana.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫిర్యాదుపై స్పందన, తీసుకున్న చర్యలను మొబైల్‌కు SMS ద్వారా సమాచారం వస్తుందని తెలిపారు.