ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందని సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు. సంక్లిష్టమైన ఈ అంశంలో ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. వర్గీకరణ అంశంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండ అమలు చేయాలన్న ఉద్దేశంతోనే అధ్యయనానికి మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో మంత్రులు రాజనర్సింహ, పొన్నం, సీతక్కతో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిన విషయాన్ని గుర్తుచేశారు.