TG: పదేళ్లలో ఏమీ చేయని వాళ్లు ఏడాదిలోనే కాంగ్రెస్ ఏం చేయలేదని అంటున్నారని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 'పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉన్నారు, 12 ఏళ్లుగా దేశంలో మోదీ,12 నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి చర్చకు వస్తే సీఎంగా నేను సిద్ధం. గత పదేళ్ల పాలనపై చర్చిద్దాం.. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా.' అని రేవంత్ సవాల్ విసిరారు.