ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య తుది పోరు జరగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచే జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ లభించనుంది. ఐసీసీ ప్రకటించిన వివరాల ప్రకారం విన్నింగ్ జట్టు రూ.19.48 కోట్లు అలాగే ఓడిన జట్టు రూ.9.74 కోట్లు ప్రైజ్‌మనీ పొందనుంది.