అంటు వ్యాధులను టీకాలతో అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం చేపట్టిన ఈ టీకా విధానంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి ఈ ఏడాది జనవరి, ఆగస్టు మధ్య మొత్తం ఆరు ఫార్మా కంపెనీలకు 8 కొత్త వ్యాక్సిన్‌లను పరీక్షించడానికి పర్మిషన్ ఇచ్చింది. అయితే వీటిలో 4 వ్యాక్సిన్‌లు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే రెండేళ్లలో ఈ పరీక్షలన్నీ పూర్తి కానున్నాయి. కాగా, ఇందులో టీబీ నుంచి డెంగ్యూ వరకూ టీకాలు రెడీ చేస్తున్నారు.