దేశంలో సైబర్ నేరాలు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మరిన్ని చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫేక్ ఐడీలు ఇచ్చి తీసుకున్న, సైబర్ క్రైమ్‌లలో ప్రమేయం ఉన్న సిమ్ కార్డుల రద్దు దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ చర్యలు అమల్లోకి వస్తే దేశంలో దాదాపు 2.17 కోట్ల సిమ్‌కార్డులు రద్దు కానుండగా, 2.26 లక్షల మొబైల్ ఫోన్లు బ్లాక్ కానున్నట్టు సమాచారం.