ఆముదం నూనెతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆముదం నూనెలో కాల్షియం, ప్రొటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాటీ యాసిడ్, రిసినోలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్ ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్‌లను తగ్గిస్తుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా కాలిన గాయాలు, పుండ్లు, ఇతర గాయాలపై ఆముదం నూనె రాస్తే అవి త్వరగా మానిపోతాయి.