మరో రెండు మూడేళ్లలో ఫేసియల్ రికగ్నిషన్ ద్వారా ఓనర్లను గుర్తు పట్టే కార్లు రాబోతున్నాయి. అందుకు సంబంధించిన ప్రదర్శన అమెరికాలోని లాస్‌వేగాస్‌లో నిర్వహిస్తున్న ఆటోఎక్స్‌పోలో జరుగుతోంది. ప్రస్తుత కాలంలో బయోమెట్రిక్ పలు కొత్త పుంతలు తొక్కుతోందని ప్రముఖ ఇంజనీర్ క్లాడియో లాంగో అన్నారు. అత్యాధునిక సాంకేతికతతో కొత్త వినియోగదారులు పెరుగుతారు అని అన్నారు.