కొంతమంది యువకులు తుపాకులు పట్టుకుని రోడ్డుపై కారు, బైకులతో స్టంట్స్ చేశారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. నోయిడాలో వాహనాలతో స్టంటింగ్ కేసులు ఆగడం లేదని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. భారీ చలాన్లు విధిస్తే గానీ ఇటువంటి ఘటనలు ఆగవని అభిప్రాయపడుతున్నారు.