విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు. దీంతో పాలపిట్టను పంజరంలో బంధించి రావణదహనం, జమ్మి బంగారం ఇచ్చిపుచ్చుకునే ప్రదేశాల్లో ప్రదర్శిస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఈ క్రమంలో సరిగా ఆహారం, నీరు అందక డీహైడ్రేషన్‌తో ఇవి చనిపోతున్నాయి. దీనిపై జంతుప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రపక్షిని బంధించే వారిపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.