అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA) తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. 2019 నుంచి ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలు, లావాదేవీలు, విరాళాల వివరాలు ఇవ్వాలని కోర్టు నోటీసులో పేర్కొంది. తానాలో రూ.30 కోట్ల నిధులు గోల్‌మాల్ చేసినట్లు వార్తలు రావడంతో ఈ మేరకు కోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.