మద్యానికి బానిసైన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మైనర్ కుమార్తెను తాడుతో కట్టి దూలానికి తలకిందులుగా వేలాడదీశాడు. ఈ ఘటన యూపీలోని లలిత్‌పూర్ లో ఇటీవల చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మేరకు మత్తుకు బానిసైన తండ్రి కన్న కూతురిని దారుణంగా కొట్టాడు. అనంతరం తాడుతో కాళ్ళను కట్టి దూలానికి వేలాడదీశాడు. దీనిని గమనించిన స్థానికులు అతడిని నిలదీశారు. ఈ మేరకు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.