TG: పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గోదావరిఖనికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ యశ్వంత్‌ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రుడిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.