బ్రెజిల్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ బ్రిడ్జి ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్టు సమాచారం. ఓ వ్యక్తి బ్రిడ్జ్ పరిస్థితిని వివరిస్తూ వీడియో తీస్తున్నాడు. దానిపై పగుళ్లు చూపిస్తున్నాడు. అదే సమయంలో ఓ కారు రాగా, బలహీనంగా ఉన్న బ్రిడ్జ్ కొంత భాగం కూలిపోయింది. తర్వాత మొత్తం బ్రిడ్జి కూలిపోవడం వీడియోలో చూడొచ్చు.