హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ ఆధిక్యం, గెలుపు కలిపి 50 స్థానాల్లో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ 34 స్థానాలకు పరిమితమైంది. ఐఎన్‌ఎల్‌డీ 2, ఇతరులు 4 స్థానాల్లో గెలుపు దిశగా కొనసాగుతున్నారు. ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఇప్పటికే కాంగ్రెస్ 10, బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించాయి.