AP: చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఆదోని కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. కాగా నరసరావుపేటతో పాటు మరో చోట నమోదు అయిన కేసుల్లోనూ ఆయనకు ఊరట లభించింది. దీంతో మొత్తం 4 కేసుల్లో పోసానికి బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం కర్నూలు జైలులో ఉన్న పోసాని, బుధవారం జైలు నుంచి పోసాని విడుదలవనున్నారు.