జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు వంటి తృణధాన్యాల్లో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని డైట్‌లో చేర్చుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఉదయపు అలసటను వీటిలోని పోషకాలు దూరం చేస్తాయి. దీనితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. తృణ ధాన్యాల్లోని ఫైబర్ కంటెంట్ జీర్ణఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పొట్ట ఉబ్బరం, మలబద్ధకం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలను, అధిక బరువును తగ్గిస్తుంది.