విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. తాజాగా ఈ సెట్‌లో నటుడు బాలకృష్ణ సందడి చేశారు. వెంకటేశ్, అనిల్‌తో కాసేపు సరదగా మాట్లాడారు. అనంతరం ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను మూవీ టీం పంచుకుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.